ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వేగం పెంచాలి
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నిర్మల్‌చైన్‌గేట్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వేగం పెంచాలని, వనమహోత్సవం విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. హై దరాబాద్‌లోని డాక్టర్‌బీఆర్.అంబేడ్కర్ సచివాల యం నుంచి మంత్రి కొండా సురేఖతో కలిసి జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వనమహోత్సవంలో నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుపై ప్ర త్యేక దష్టి సారించాలని, టీబీ ముక్త భారత్ లక్ష్యం సాధించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావే శ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష నిర్వహించారు.
మొక్కల లక్ష్యం 69.55 లక్షలు..
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా జిల్లాలో 69.55 లక్షల మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో గుంతలు తవ్వించి మొక్కలు నాటేలా చర్యలు చేపట్టాలన్నారు. 4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వానాకాలం పంటల సాగుకు ఎరువుల కొరత లేకుండా మండల స్థాయిలో నిల్వలపై రోజువారీ గా నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ పూర్తయిన వెంటనే గ్రౌండింగ్ చేసి, యాప్‌లో నమోదు చేయాలన్నారు. వర్షాకాల వ్యాధుల నివారణకు వైద్య బృందాలు, ఫాగింగ్, ఆయిల్ బాల్స్, గంభూషియా చేపల వాడకం, డ్రైడే నిరంతరం కొనసాగించాలని తెలి పారు. ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, పరీక్ష కిట్లు సిద్ధంగా ఉంచాలని, డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టా లన్నారు. భూభారతి దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రి య పూర్తయిన వెంటనే అవసరమైన నోటీసులు సిద్ధం చేయాలన్నారు. సీఎంఆర్ రైస్ వేగవంతంగా పూర్తి చేసేలా తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నా రు. మండలస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలపై తక్షణ మే స్పందించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, డీఎఫ్‌వో నాగినిభాను, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, ఇన్‌చార్జ్ డీఆర్డీవో నాగవర్ధన్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజేందర్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.


