గంజాయి విక్రేతల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేతల అరెస్టు

May 22 2025 12:09 AM | Updated on May 22 2025 12:09 AM

గంజాయి విక్రేతల అరెస్టు

గంజాయి విక్రేతల అరెస్టు

జైనథ్‌ : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ గోదాం వద్ద బుధవారం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై గౌతమ్‌ తెలిపారు. అదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్‌నగర్‌కాలనీకి చెందిన సాహీల్‌, ముషీర్‌ గంజాయి విక్రయిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేసి 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పేకాడుతున్న 13 మంది..

నేరడిగొండ: పేకాడుతున్న 13 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు నేరడిగొండ ఎస్సై శ్రీకాంత్‌ సిబ్బంది తో కలిసి వెళ్లి మండల కేంద్రంలోని నీలిమ దా బా వెనకాల దాడులు నిర్వహించి పేకాడుతు న్న 13 మందిని పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి పేక ముక్కలతో పా టు రూ.14,080 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, 13 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సయ్యద్‌ జహీర్‌, గడ్డం రవి చందర్‌రెడ్డి, గూడూరు లవకుమార్‌, రాథోడ్‌ రవీందర్‌, అల్లూరి శివారెడ్డి, ఉప్పు పోశెట్టి, సోలంకి శ్రీనివాస్‌, నల్ల అడెల్లు, సోలంకి కరన్‌ సింగ్‌, గోతి గులాబ్‌ సింగ్‌, మాడ గంగాధర్‌, అల్లూరి శ్రీనివాస్‌ రెడ్డి, పవార్‌ సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

టపాసులతో ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: అర్ధరాత్రి టపాసులు పేల్చి జనాలను ఇబ్బందికి గురిచేసిన వ్యక్తిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కరుణాకర్‌ రావు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన చోట ముష్రఫ్‌ తన జన్మదినం సందర్భంగా ఇంటి ముందు, బిల్డింగ్‌పై బాణసంచాలు పేల్చాడు. దీంతో చుట్టుపక్కల వారు ఇబ్బందులకు గురయ్యారు. ఓ ఇంటిపై వేసిన ప్లాస్టిక్‌ కవర్‌కు నిప్పు అంటుకోవడంతో కొంత భాగం కాలిపోయింది. దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

ఐదుగురిపై..

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని చాందా (టి) శివారు ప్రాంతం మీదుగా ఎలాంటి డా క్యుమెంట్‌లు లేకుండా వాహనంలో రెండు ఎ డ్లను తరలిస్తున్న రాథోడ్‌ నితిన్‌, షేక్‌ సాకీర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి ష్ణు వర్ధన్‌ తెలిపారు. అలాగే వాహనాన్ని అడ్డుకుని బెదిరింపులకు గురి చేసిన చాందా (టి) గ్రామానికి చెందిన ముగ్గురు యువకులపై రాథోడ్‌ నితిన్‌, షేక్‌ సాకీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

దాడి చేసిన వ్యక్తులపై..

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని పండ్ల వాపారిపై దాడికి పాల్పడిన షన్ను, మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ సీఐ కరుణాకర్‌ రావు తెలిపారు. బుధవారం ఆదిలాబాద్‌ పట్టణంలో తోపుడు బండ్లపై షేక్‌ షహెబాజ్‌ పండ్లు విక్రయిస్తున్నాడు. ఎద్దు వచ్చి పండ్లను తింటుండగా అతను ఎద్దును కొట్టడంతో షన్నుకు తగిలింది. దీంతో ఆయన ద్విచక్ర వాహనం దెబ్బతింది. ఇందుకు రూ.2వేలు ఇవ్వాలని అడిగాడు. తనవద్ద లేవని చెప్పడంతో తన మిత్రులను పిలిచి షహెబాజ్‌పై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement