
ఇసుక ఫిల్టర్ చేసే బోట్ సీజ్
జైనథ్: పెన్‌గంగ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యాపారి అభిలాష్‌రెడ్డితో పాటు సాంగ్వి గ్రామ వీడీసీ సభ్యులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు పెన్‌గంగ నది శివారులోని సాంగ్వి గ్రామం వద్ద ఎస్సై గౌతమ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఉల్లాస్, సిబ్బందితో కలిసి దాడు లు నిర్వహించినట్లు తెలిపారు. ఇసుకను ఫిల్టర్ చేసే బోట్‌ను సీజ్ చేసినట్లు పేర్కొ న్నారు. వారిపై ఇసుక దొంగత నం, పీడీపీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.