
భైంసాలో ఘనంగా తిరంగా ర్యాలీ
భైంసాటౌన్: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా పట్టణంలో పలు కులసంఘా ల ఆధ్వర్యంలో మంగళవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక పద్మావతి కాలనీలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ర్యాలీని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుల సంఘాలు, హిందూ సంఘాల నాయకులు, యువకులు, చిన్నారులు జాతీయజెండాలు చేతపట్టి ర్యాలీ లో పాల్గొన్నారు. దారి పొడువునా భారత్‌మాతాకీజై, సైనిక అమరవీరులకు జై నినాదాలతో హోరెత్తించారు. కుభీర్ చౌరస్తా నుంచి గాంధీగంజ్ మీదుగా, బస్టాండ్ ఎదురుగాగల అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయగీతాలాపన చేశారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. భారత త్రివిధ దళాల ధైర్య సాహసాలను స్మరించుకునేలా కుల, మత, రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం హర్షణీయమన్నారు. యాత్రలో పట్టణానికి చెందిన వైద్యులు, న్యా యవాదులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులు, యువకులు, మహిళలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.