
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
నిర్మల్‌టౌన్: జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులు సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివాదాలు రాజీపడే క్రిమినల్ కేసులు, పెండింగ్‌లో ఉన్న మోటార్ కేసులు, పెట్టి కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు కక్షిదారులందరికీ సమాచారం అందించి రాజీ పడేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందులో నిర్మల్ ఏఎస్పీలు ఉపేంద్రారెడ్డి, అవినాష్, రాజేశ్‌మీనా, జిల్లాలోని పోలీసు అధికారులు పాల్గొన్నారు.
డ్రగ్స్ కనిపిస్తే కాల్ చేయండి
జిల్లాలో మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయిస్తే పోలీ సులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ జానకీషర్మిల మంగళవారం కోరారు. మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసినా, విక్రయించినా 8712659599 నంబర్‌కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.