
వన్యప్రాణులను సంరక్షించాలి
● అటవీ శాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్
నిర్మల్ టౌన్: వన్యప్రాణుల సంరక్షణకు సహకరించాలని అటవీ శాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వాణన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో వైల్డ్ లైఫ్ ఫండ్ ఎన్జీవో ఆధ్వర్యంలో ‘వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర ’అను అంశంపై సోమవారం శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా శర్వాణన్ మాట్లాడుతూ.. వన్య ప్రాణులను సంరక్షిస్తే ప్రకృతిని, జీవ వైవిధ్యాన్ని కాపాడినవారమవుతామని తెలిపారు. జిల్లా ఆటవీశాఖ అధికారి నాగిని భాను, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు హర్షవర్ధన్, రాజు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.