
అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు
● కలెక్టర్ అభిలాష అభినవ్ ● ప్రజావాణిలో వినతుల స్వీకరణ
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని, ప్రజావాణికి వచ్చే అర్జీలను పెండింగ్‌లో పెట్టవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, భూసమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తదితర అంశాలపై ప్రజల నుంచి 83 ఆర్జీలు వచ్చాయి. సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శాఖల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక టెలీ ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 5 ఫోన్‌కాల్ అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. దూర ప్రాంతాల ప్రజలు 91005 77132 నంబరును సంప్రదించి వాట్సాప్ ద్వారా సమస్యలు పంపవచ్చని తెలిపారు.
పకడ్బందీగా ప్రభుత్వ పథకాల అమలు..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం మాట్లాడుతూ త్వరగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం గ్రామపంచాయతీలలో లబ్ధిదారుల లిస్టు వుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను మండల స్థాయిలో త్వరితంగా పరిశీలించి బ్యాంకులకు పంపాలన్నారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉపాధి హామీ పనుల్లో తాగునీరు, టెంట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇటీవల రుణాల మంజూరులో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.