
భారత సేనలకు శక్తినివ్వాలి
భైంసాటౌన్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై జరుగుతున్న పోరులో భారత సేనకు అనంత శక్తిని వ్వాలని కోరుతూ బీజేపీ నాయకులు ఆదివారం స్థానిక గట్టు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రమూకలపై భీకర దాడులతో భారతశక్తిని ప్రపంచానికి చాటామని చెప్పారు. భారత దాడులకు బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపా రు. కానీ, అంతలోనే తన వక్రబుద్ధిని చూపిందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పేలా భారత సేనకు మరింత శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు రావుల రాము, నాయకులు వడ్నప్ శ్రీనివాస్, తోట లింగురాం, రావుల పోశెట్టి, తుమోల్ల దత్తాత్రి, గాలి రాజు, దిలీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.