నిర్మల్‌చైన్‌గేట్: రబీలో రైతులు పండించిన వరి ధా న్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని అదన పు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు ప్ర క్రియల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త ప డాలని సూచించారు. ఓపీఎంఎస్ యాప్, జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందు కు ప్రత్యేకంగా రూపొందించిన లోకల్ యాప్, ట్యా బ్ ఎంట్రీ ప్రక్రియపై అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు, తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, డీఎస్వో కిరణ్‌కుమార్, డీఎం వేణుగోపా ల్, డీసీవో పాపయ్య, ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


