● ఎస్పీ జానకీ షర్మిల ● వైద్యులు, సిబ్బందికి సన్మానం
నిర్మల్ టౌన్: పోలీసులు ఆరోగ్య రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించా రు. పోలీసులకు ఉచిత మెడికల్ టెస్టుల క్యాంప్ ను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలపాటు నిర్వహించారు. ఇందులో విధులు నిర్వర్తించిన వైద్యాధికారులు, మెడికల్ సిబ్బందిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తుంటే పోలీస్ అధికారులు, సి బ్బంది ఆరోగ్యం పాడవుతుందని గ్రహించి వై ద్యాధికారులతో మాట్లాడి మెడికల్ క్యాంపు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 30 ఏళ్లు పైబడిన 703 మంది పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. రిపోర్టులు వచ్చిన తర్వాత సంబంధిత వైద్యులకు చూ పించి మందులు ఇప్పించినట్లు తెలిపారు. క్యాంపులో విధులు నిర్వహించిన డాక్టర్లు, ఆస్పత్రి, ల్యాబ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీలు అవినాష్‌కుమార్, రాజేశ్ మీనా, ఏవో యూనస్‌అలీ, ఇన్‌స్పెక్టర్లు గోవర్ధన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, కృష్ణ, సమ్మయ్య, ఆర్‌ఐలు రాంనిరంజన్, శేఖర్, రామకృష్ణ, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


