
గంజాయి కేసులో అన్నదమ్ముల అరెస్ట్
జైనథ్: గంజాయి కేసులో మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన అన్నదమ్ములు సోర్తె రుపేష్ బాబు, సోర్తే ప్రవీణ్ బాబులను అరెస్ట్ చేసినట్లు జైనథ్ సీఐ డి.సాయినాథ్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జైనథ్, లక్ష్మీపూర్ ఎక్స్‌రోడ్ సమీపంలో ఎస్సై పురుషోత్తం వాహనాలు తనిఖీ చేస్తుండగా రూపేష్ బాబు, ప్రవీణ్ బాబు పల్సర్ బైక్‌పై గంజాయిని ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 140 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. అన్నదమ్ములిద్దరూ కొంత కాలంగా తమ చేన్లో పత్తి పంటలో గంజాయిని అంతర పంట సాగు చేసున్నట్లు వెల్లడించారు.