
కళారత్న పురస్కారం స్వీకరిస్తున్న పోలీస్ భీమేశ్
నిర్మల్‌ఖిల్లా: యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్‌కు వెన్నెల డ్యాన్స్ అకాడమీ సంస్థ ఉగాది కళారత్న పురస్కారం అందించింది. ఉగాది పర్వదినాన్ని పుర స్కరించుకుని మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జానపద జాతర పేరిట కార్యక్రమం నిర్వహించారు. శిల్పం, చిత్రలేఖనం, కవిత్వం వంటి పలుకళల్లో రాణిస్తున్న యువకవి, కళాకారుడు పోలీస్ భీమేశ్‌కు జానపద కళాకారులు రేలారె రేలా రవి, నాగలక్ష్మి, వెన్నెల డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు డాన్స్ మా స్టర్ ధనరాజ్ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భీమేశ్‌ను జిల్లాకు చెందిన పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అభినందించారు.