
మాట్లాడుతున్న ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
● ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
లోకేశ్వరం: జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటికి ఏదో ఒకరూపంలో తెలంగాణ ప్రభుత్వం ప్ర వేశపెట్టిన సంక్షేమ పథకం అందుతోందని ముధో ల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో సోమవారం బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేసీఆర్ పంపించిన సందేశాన్ని పార్టీ సీనియర్ నాయకుడు రాజేశ్‌బాబు చదివి వినిపించారు. ఈసందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో ప్రభుత్వ నిధులతో గుళ్లు నిర్మించామన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. మండలంలోని పంచగుడి, మన్మద్, గడ్‌చాంద, పిప్రి, కన్కపూర్ గ్రామాల్లో ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్న నిరుపేదలు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు అందిస్తామని తెలిపారు. వచ్చే నెలలో సీఎం కేసీఆర్ జిల్లాకు వస్తున్నారని, ఆ సభలో మండలంలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్‌ఎస్‌కు ప్రజలు మరోసారి పట్టం కట్టి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ శ్యాసుందర్, పీఏ సీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, పీఏసీఎస్ మాజీ చైర్మ న్లు లక్ష్మణ్‌రావు, చిన్నారావు,సర్పంచులు నరేష్, ఎల్లన్న, నాయకులు బాయమోల్ల భోజన్న, ప్రశాంత్, గంగాధర్, దిగంబర్, శ్రీధర్, రాజేశ్‌బాబు, ఉత్తం భోజారెడ్డి, సాయారెడ్డి, రాజారెడ్డి, రమేశ్‌రెడ్డి, సాహెందర్, అనిల్, ఆంజనేయులు, సుధాకర్, సుదర్శన్‌రెడ్డి, నాలం గంగాధర్, రాజేశ్వర్, రాజు, ఉత్తం, అనిల్, ప్రకాశ్, అసిబొద్దీన్, మగ్గిడి భోజారెడ్డి పాల్గొన్నారు.