ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ

YSRCP MPs Meeting In AP Bhavan Delhi Over Parliament Session - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఏపీ భవన్‌లో సోమవారం భేటీ అయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేత్వత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బెల్లాన చంద్రశేఖర్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, రంగయ్య, సత్యవతి, భరత్‌, పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయలు, ఎన్‌వీవీ సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి తదితులు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం.

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వారిద్దరిని హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించిన విషయం విదితమే. కాగా కాకినాడ ఎంపీ వంగ గీత సైతం ఇటీవలే మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top