ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్‌ | Woman Beats Food Delivery Agent With Shoe In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను చితకబాదిన యువతి.. వీడియో వైరల్‌

Apr 16 2022 9:17 PM | Updated on Sep 5 2022 12:31 PM

Woman Beats Food Delivery Agent With Shoe In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయింది. ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను చితకబాదింది. చెప్పుతో కొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా..  యువతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. జబల్‌పూర్ జిల్లాలోని రసల్‌చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా ఫుడ్‌ డెలివరీ బాయ్‌.. ఆమె బైక్‌ను ఢీకొట్టాడు. అయితే సదరు యువకుడు రాంగ్‌ రూట్‌లో వచ్చి.. సిగ్నల్ పడిన దగ్గర మహిళ బైక్ ఆపి ఫోన్‌ మాట్లాడుతుంటే ఢీకొట్టాడు. అంతే సదరు యువతి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. అందరి ముందే రోడ్డుపై ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను చెప్పు తీసుకొని చితకబాదింది. ఈ క‍్రమంలో ఆ యువకుడు తప్పైందని చెబుతున్నా వినిపించుకోకుండా రెచ్చిపోయింది. పక్కనున్నా వాళ్లు ఆమెకు ఎంత చెప్పినా ఆమె మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కొడుతూనే ఉంది. 

ఇదిలా ఉండగా.. సదరు యువతి చేసిన హంగామా వల్ల రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, పబ్లిక్‌ ప్లేస్‌లో ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిద్దరినీ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేసినందు ఫుడ్‌ డెలివరీ బాయ్‌కు ఫైన్ వేసి.. యువతికి వార్నింగ్‌ ఇచ్చి స్టేషన్‌ నుంచి పంపించేశారు. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంత పొగరు తగదంటూ హితవు పలుకుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement