Video Viral: స్కూల్‌ విద్యార్థులతో టాయిలెట్‌ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్‌

Viral Video: Primary School Students Made To Clean Toilet By Principal in UP - Sakshi

లక్నో: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులతో ప్రిన్సిపల్‌ టాయిలెట్లు శుభ్రం చేయిస్తున​ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్‌లోని విద్యార్థులను ప్రిన్సిపల్‌ వాష్‌రూమ్‌లు శుభ్రం చేయాలని ఆదేశించాడు.  ప్రిన్సిపల్‌ పక్కన నిలబడి పిల్లలచేత టాయిలెట్లు కడిగించాడు.

అంతేగాక విద్యార్థులకు మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు. సరిగా క్లీన్‌ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు.

ఇందులో కొందరు విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు విధ్యాశాఖ అధికారి అఖిలేష్‌ కుమార్‌ ఝా తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
చదవండి: పగ తీర్చుకున్నాడు.. కాటేసిన పామును కసితీరా కొరికి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top