షాకింగ్‌ ఘటన: వీధి కుక్కలకి ఆహారం పెడుతుండగా..ర్యాష్‌గా దూసుకొచ్చిన కారు

Viral Video: Chandigarh Woman Hit By Car While Feeding Stray Dog - Sakshi

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఎన్ని కట్టుదిట్టమైన వాహన చట్టాలను తీసుకొచ్చినా.. ఏదో ఒక దుర్ఘటన  జరుగుతూనే ఉంటోంది. మొన్నటి మొన్న ఒక మహిళను కారుతో ఢీ కొట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక యువతి ఘోర రోడ్డుప్రమాదం బారిన పడింది.

వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల తేజస్వీత, ఆమె తల్లి మంజీదర్‌ కౌర్‌లు ఇంటి సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక ఎస్‌యూవీ కారు యూటర్న్‌ తీసుకుని వచ్చి మరి తేజస్వీతను దారణంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తేజస్వీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ కారు కనీసం ఆగకుండా అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ అనుహ్య ఘటనతో బిత్తరపోయిన ఆమె తల్లి మంజీదర్‌ కౌర్‌ వెంటనే తేరుకుని పోలీసుకు ఫోన్‌ చేసి తదనంతర కుటుంబసభ్యులకు సమాచారం అందించింది.

ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోటుకుంటుందని తెలిపారు. బాధితురాలి తండ్రి ఓజస్వీ కౌల్‌ మాట్లాడుతూ..తేజస్విత ఆర్కిటెక్కర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఆమె వీధి కుక్కలకి ఆహారం పెట్టేందుక తన తల్లితో కలిసి వెళ్తుంటుందని ఆవేదనగా చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

(చదవండి: ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..అయినా దక్కని ప్రాణాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top