టీవీకే పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు | Vck Has Declared Its Full Support For The Tvk Party | Sakshi
Sakshi News home page

టీవీకే పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు

May 9 2026 4:39 PM | Updated on May 9 2026 7:30 PM

Vck Has Declared Its Full Support For The Tvk Party

చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకే నుంచి మద్దతు లేఖ టీవీకే బృందం అందుకుంది. వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్‌ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 121కి టీవీకే బలం చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు మద్దతు ఇచ్చాయి.

మరోసారి గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ను విజయ్‌ కోరారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు అందజేశారు. వీసీకే చీఫ్‌కు డిప్యూటీ సీఎం పదవి, పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.

కాగా,  తమిళనాడు రాజకీయాలు గత నాలుగు రోజులుగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ని తలపించాయి. నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి విజయ్‌ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్‌ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్‌ తీసుకున్న ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌), విడుదలై చిరుతైగళ్‌ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్‌కు పెద్ద షాక్‌ తప్పలేదు.

సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారాయి. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) వీసీకేతో పాటు ఐయూఎంఎల్‌ కూడా మద్దతు ఇచ్చింది. దీంతో టీవీకే విజయ్‌కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 121కి టీవీకే బలం చేరింది.

 

 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement