కేంద్రమం‍త్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు కరోనా | Union Minister Prakash Javadekar Tests Corona Positive | Sakshi
Sakshi News home page

కేంద్రమం‍త్రి ప్రకాశ్‌ జవదేకర్‌కు కరోనా

Apr 16 2021 5:57 PM | Updated on Apr 16 2021 6:26 PM

Union Minister Prakash Javadekar Tests Corona Positive - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరిని మహమ్మారి తన గుప్పిట్లోకి లాక్కుంటోంది. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్ప, యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు నేతలకు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఈ లిస్ట్‌లో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా చేరారు.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. శుక్రవారం రోజు కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్‌ టెస్ట్‌ చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు.

చదవండి:
రేపటి నుంచి కోవిడ్‌ ఆసుపత్రిగా గాంధీ హాస్పిటల్‌ 
కరోనా: బయటపడ్డ ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement