పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్‌.. ఆనందంతో ఆహ్వానించిన కాంతి అళగిరి

Udhayanidhi Stalin calls on MK Alagiri at his Madurai Residence - Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరితో సీఎం ఎంకే స్టాలిన్‌ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ భేటీ అయ్యారు. మదురైలో తన పెద్దనాన్న అళగిరి ఆశీస్సులను అందుకున్నారు. డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి అన్న విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడు డీఎంకే కింగ్‌ మేకర్‌గా ఒకప్పుడు ఎదిగిన  ఆయన ప్రస్తుతం రాజకీయాలకే దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌తో ఏర్పడ్డ వైరమే కారణం అనేది జగమెరిగిన సత్యం.

అనేక సందర్భాల్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి రావడంతో అళగిరి మౌనంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో మదురై పర్యటనకు వెళ్లిన మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ తన పెద్దనాన్నను కలిశారు. అళగిరి, ఆయన సతీమణి కాంతి అళగిరి ఆనందంతో ఉదయనిధిని ఆహ్వానించిచారు.

ఈసందర్భంగా పెద్ద నాన్న అళగిరి శాలువతో సత్కరించి ఉదయ నిధికి ఆశీస్సులు అందించారు. అళగిరి మాట్లాడుతూ తాను డీఎంకేలో లేనని, తమ్ముడి కొడుకు తమ ఇంటికి రావడం ఆనందం కలిగించిందన్నారు. తమ్ముడు సీఎంగా ఉండడం, కుమారుడు మంత్రి కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. డీఎంకే లోకి మళ్లీ వస్తారా? అని ప్రశ్నించగా ఈ  ప్రశ్నకు సమాధానం అక్కడే అడగండి అని దాట వేశారు. 

చదవండి: (విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్‌..104 సార్లు ఫెయిల్‌..105వ సారి శభాష్‌ అనిపించుకున్నాడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top