ఐఎన్‌ఐ సెట్‌ వాయిదా వేయండి, సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court Order On Aiims For Ini Entrance Exam Deferment - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ కంబైన్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐఎన్‌ఐ సెట్‌) 2021ను జూన్‌ 16న నిర్వహించాలనడం ఏకపక్షంగా అనిపిస్తోందని, వాయిదా వేయాల ని ఢిల్లీ లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్‌ 16న నిర్వహించాల్సి ఉన్న ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని స్పష్టంచేసింది. ‘‘పరీక్షకు హాజరు కావాలనుకొనే చాలా మంది అభ్యర్థు  లు కోవిడ్‌ విధుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని నిర్ణయిం చాం. నెల రోజుల తర్వాత ఎప్పుడైనా పరీక్ష నిర్వహించొచ్చు’’అని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ , జస్టిస్‌ ఎంఆర్‌షాల ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్‌ నిర్వహిస్తున్న ఐఎన్‌ఐ సెట్‌లో 815 సీట్లకుగాను సుమారు 80 వేల మంది అభ్యర్థు లు పోటీపడుతున్నారు.

చ‌ద‌వండి : 'అద్దాల మేడల్లో నివసించేవాళ్లు ఎదుటివాళ్లపై రాళ్లు విసరకూడదు'
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top