ప్రయాగ్‌రాజ్‌లో అబ్బురపరచిన కాంతి వలయం

Sun halo spotted in Prayagraj - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ పట్టణంలో ఆకాశంలో అద్భుత దృశ్యం సాక్షాత్కారించింది. శుక్రవారం సూర్యుడి చుట్టూ ఏర్పడిన కాంతి వలయం చూపరులను ఆశ్చర్యపర్చింది. కొన్ని గంటలపాటు కనిపించిన ఈ దృశ్యాన్ని జనం ఫోన్లలో బంధించారు. సూర్యుడి చుట్టూ ఏర్పడే కాంతి వలయాన్ని ‘సన్‌ హాలో’ అంటారు.

వాతావరణంలో కాంతి వెదజల్లినట్లుగా మారినప్పుడు ఇలా రింగ్‌ లాంటి ఆకృతి ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు వాతావరణంలోని మంచు స్ఫటికాలను ఢీకొట్టినప్పుడు కాంతి వెదజల్లినట్లుగా మారుతుంది. అప్పుడు భానుడి చుట్టూ వలయాన్ని చూడొచ్చు. సాధారణ మేఘాల కంటే అధికంగా తెల్లగా, పలుచగా ఉండే సిరస్‌ మేఘాల్లో మంచు స్ఫటికాలు ఉంటాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top