పాము ముంగిసల ఫైట్‌ వీడియో వైరల్‌! | Snake and Mongoose Fight Goes Viral | Sakshi
Sakshi News home page

పాము ముంగిసల ఫైట్‌ వీడియో వైరల్‌!

Aug 19 2020 8:53 PM | Updated on Aug 19 2020 8:53 PM

Snake and Mongoose Fight Goes Viral - Sakshi

పాము ముంగిసల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా శత్రువులు అని చెప్పాలంటే కూడా వాళ్లు పాము, ముంగిసలు లాంటోళ్లు అని చెబుతాం. అలాంటిది ఒక పాము, ముంగిస రోడ్డు మీద కొట్టుకుంటూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఒక ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అబ్ధుల్‌ కయ్యూమ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 29 సెకన్ల నిడివిగల ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఇదే ప్రకృతి అంటే. ఏ యోధుడు కూడా వెళ్లి వాటిలో ఏదో ఒకదానిని కాపాడటానికి ప్రయత్నించలేదు. అందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రకృతిలో పోరాడే వాళ్లే జీవించగలుగుతారు అని మరోసారి అర్థం అవుతుంది’ అని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ట్వీట్‌ చేశారు.దీనికి నెటిజన్లు స్పందిస్తూ అక్కడ ఉన్నవారికి జంతువుల పట్ల చాలా దయ ఉంది అందుకే అక్కడ వారు ఎవరు వాటిని విషయంలో కలగజేసుకోలేదు అని కామెంట్‌ చేశారు. నిజంగా ప్రకృతి అంటే ఇదే అని మరొకరు కామెంట్‌ పెట్టారు. వాటిని  మధ్యలోకి మనం వెళ్లకూడదు వాటి పనిని వాటిని చేసుకోనివ్వాలి అని మరొక యూజర్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

చదవండి: వైరల్‌: టాయిలెట్‌లోకి పాము ఎలా వచ్చింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement