Shocking Video: Man Dragged on Car Bonnet in Delhi - Sakshi
Sakshi News home page

Shocking Video: షాకింగ్‌ వీడియో: వ్యక్తిని ఢీకొట్టిన కారు.. బానెట్‌పై వేలాడుతున్నా..

Feb 11 2022 4:35 PM | Updated on Feb 11 2022 6:57 PM

Shocking Video: Man Dragged On Car Bonnet In Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రేటర్‌ కైలాష్‌ ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో బాధితుడు కారు బానెట్‌పై వేలాడుతున్నా.. కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. అలా కారు కొంత దూరం వెళ్లిన తరువాత బానెట్‌పై పడిన వ్యక్తి జారి రోడ్డు మీద పడ్డాడు. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా..  సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

క్షతగాత్రుడిని 37 ఏండ్ల ఆనంద్ విజయ్ మండేలియాగా గుర్తించారు.  బాధితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెజటిన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆనంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని 27 ఏళ్ల న్యాయ విద్యార్థిగా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: అమానవీయం: తల్లిపై కొడుకు అసభ్యకర ప్రవర్తన, లైంగిక వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement