రేర్‌ ఫోన్‌కాల్‌, రహస్య లేఖ‌.. అభినందన్‌‌ను వదిలేశారు

Raw Chief Rate Phone Call And Letter To Pak Over Abhinandan Varthaman - Sakshi

న్యూఢిల్లీ : 2019, ఫిబ్రవరి నెలలో భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్‌-21 కూలిపోవడంతో ప్యారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగి పాక్‌ ఆర్మీకి చిక్కారు. దాదాపు 60 గంటలపాటు నిర్బంధంలో ఉంచి జనీవా ఒప్పందం ప్రకారం పాక్‌ అభినందన్‌ను వదిలేసింది. అయితే అభినందన్‌ను వదిలేయటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆయన‌ పాక్‌ చెరలో ఉన్న సమయంలో రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) చీఫ్‌ అనిల్‌ ధస్‌మనా పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. అభినందన్‌కు ఏమైనా అయితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తేల్చి చెప్పారు.

ప్రధాని మోదీ సూచనల మేరకు.. ఐఎస్‌ఐ కౌంటర్‌ పార్ట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ సయ్యద్‌ అసిమ్‌ మునిర్‌ అహ్మద్‌ షాకు రేర్‌ ఫోన్‌ కాల్‌, రహస్య లేఖ‌ ద్వారా ఈ హెచ్చరికలు చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్‌ వెనక్కు తగ్గి అభినందన్‌ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది. 2019, ఫిబ్రవరి 28వ తేదీన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత‌ సైనికుడ్ని వదిలేస్తున్నట్లు నేషనల్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

చదవండి : నాడు అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టర్‌.. నేడు కూలీ

రూ.90 లక్షల ప్లాట్‌ కొని.. సొరంగం తవ్వి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top