ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌కు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై అమిత్‌ షా ఆరా

Punjab EX CM Parkash Singh Badal Admitted To Mohali Hospital - Sakshi

చండీగఢ్‌: శిరోమణి అకాలీదళ్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌(95) అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. బాదల్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వివరాల ప్రకారం.. ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బాదల్‌ ఆరోగ్య పరిస్థితి విషయం తెలిసిన వెంటనే అమిత్‌ షా.. ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కుమారుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అమిత్‌ షా ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. “ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నాకు చాలా బాధ కలిగిస్తోంది. ప్రకాశ్‌ సింగ్‌ గారి ఆరోగ్య పరిస్థితి గురించి నేను సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌కు ఫోన్‌ చేసి తెలుసుకున్నా” అని షా ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. గతేడాది కూడా ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ శ్వాస నాళాల ఆస్తమా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఇక, 2022లో కోవిడ్‌ బారినపడ్డారు. అనంతరం, కరోనా నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌.. ఐదుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక, 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top