
సాక్షి, మండ్య: ‘‘మూడున్నరేళ్లుగా కర్ణాటకను పాలిస్తున్న బీజేపీ ప్రజలను మోసం చేసింది. ఇదొక లూట్, జూట్ సర్కారు’’ అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వద్రా విమర్శించారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ ప్రచార సభలో ఆమె మాట్లాడారు.
లంచగొండి బీజేపీ వద్దని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని అన్నారు. 40 శాతం కమీషన్ల ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తోందని ఆరోపించారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ విధించిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు.