అదేం డ్రెస్సింగు? సినిమాకు వచ్చారా? ఐఏఎస్‌కు మందలింపు

Patna HC judge Pulls up IAS officer for Inappropriate Dress Code - Sakshi

పాట్నా:  ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి, కోర్టు ప్రోటోకాల్ ఫాలో కాక జడ్జి చేతిలో తిట్లు తిన్నారు.  ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

బీహార్‌ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఆనంద్ కిశోర్. సీఎం నితీశ్‌ కుమార్‌ ఆయన దగ్గర కూడా. ఓ కేసులో ఈమధ్యే ఆయన పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వేసుకున్న దుస్తులు జడ్జి పీబీ భజంత్రీకి చిరాకు తెప్పించాయి. 

‘‘ఇదేమైనా సినిమాహాల్‌ అనుకుంటున్నారా? సాధారణ డ్రెస్సింగ్‌లో రావడానికి!. సివిల్స్‌ సర్వెంట్‌లు ఎలాంటి డ్రెస్‌లో కోర్టుకు రావాలో మీకు తెలియదా? ఎక్కడ శిక్షణ తీసుకున్నారు మీరు? ముస్సోరీ ట్రైనింగ్‌లో ఈ విషయాలేవీ మీకు చెప్పలేదా? మెడ కనిపించకుండా కాలర్ బటన్స్ పెట్టుకోవాలని, కనీసం మీద కోట్ అయినా ధరించాలి అని తెలియదా? అంటూ ఆ సీనియర్‌ అధికారిపై జడ్జి అసహనంగా వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top