కునుకుపై కినుక.. నిద్ర ఆరు గంటల్లోపే... | Nearly half of Indians still sleep less than six hours | Sakshi
Sakshi News home page

కునుకుపై కినుక.. నిద్ర ఆరు గంటల్లోపే...

Mar 23 2026 5:17 AM | Updated on Mar 23 2026 5:17 AM

Nearly half of Indians still sleep less than six hours

కంటి నిండా నిద్రకు సగం మంది దూరం

లోకల్‌ సర్కిల్స్‌ దేశవ్యాప్త సర్వేలో వెల్లడి

మంచి ఆరోగ్యానికి నిద్ర అత్యంత ముఖ్యం. మానసిక ఒత్తిడి, ఆందోళన, గతి తప్పిన జీవనశైలి, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల అతివాడకం, ఆహార అలవాట్లు, అనారోగ్య సమస్యలు.. కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి కంటినిండా నిద్ర ఒక కలగా మిగిలిపోతోంది. అయితే మంచిగా నిద్ర పట్టడానికి ఇంట్లో సంతోషకర వాతావరణం, రాత్రిపూట తేలికపాటి భోజనం, పగటిపూట వ్యాయామం దోహదం చేస్తాయన్నది అత్యధికుల మాట.    – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ తాజాగా విడుదల చేసిన దేశవ్యాప్త సర్వే ప్రకారం.. చాలా మంది భారతీయులు ఇప్పటికీ తగినంత అంతరాయం లేని నిద్రను పొందలేకపోతున్నారని వెల్లడైంది. అయితే గతేడాదితో పోలిస్తే పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 12 నెలల్లో అడ్డంకులు లేని నిద్ర రోజుకి ఆరు గంటలు మించలేదని 46% మంది భారతీయులు పేర్కొన్నారు. 2025లో ఈ అభిప్రాయాన్ని వెల్లడించిన వ్యక్తుల సంఖ్య 59% నమోదైంది. దేశవ్యాప్తంగా 2025 డిసెంబర్‌ నుంచి 2026 మార్చి వరకు 393 జిల్లాల్లో జరిగిన ఈ సర్వేలో 63% మంది పురుషులు, 37% మంది స్త్రీలు పాల్గొన్నారు. ప్రథమ శ్రేణి నగరాల నుంచి 42%, ద్వితీయ శ్రేణి నగరాల నుంచి 26% మంది, మిగిలినవారు ఇతర నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు.

మంచి నిద్రకు దోహదం చేసే అంశాలు..
అంశం  -  వెల్లడించిన వ్యక్తుల శాతం 
ఇంట్లో సంతోషకర వాతావరణం  72
తేలికపాటి రాత్రి భోజనం  65
పగటిపూట వ్యాయామం  65
సౌకర్యవంతమైన దుస్తులు   43
రాత్రి 10 గంటల కంటే ముందే పడుకోవడం  - 29
మనసుకు హాయినిచ్చే సంగీతం  - 25
దోమల నివారణ ఉత్పత్తులు  - 22
నిద్రకు ముందు పుస్తకాలు చదవడం  - 14

నిద్రకు అంతరాయం కలిగించే ప్రధాన కారణాలు..
కారణం - శాతం
ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం  - 72
ఆలస్యంగా పడుకోవడం, ఉదయాన్నే ఇంటి పనులు - 42
వరుసగా 8 గంటల పాటు అస్సలు నిద్ర పట్టకపోవడం  - 28
దోమలు, బయటి శబ్దాలు వంటి ఇతర కారణాలు - 23
స్లీప్‌ అప్నియా వంటి అనారోగ్య సమస్యలు  - 19
మొబైల్‌ కాల్స్, మెసేజ్‌ల వల్ల వచ్చే ఆటంకాలు  - 14
పిల్లలు/భాగస్వామి వల్ల కలిగే ఇబ్బందులు - 12
సౌకర్యవంతంగా లేని మంచం/పరుపు  - 9

మెరుగైన నిద్ర కోసం..
రోజూ ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం
నిద్రపోయే 6–8 గంటల ముందే టీ, కాఫీ తాగడం ఆపేయండి
పడుకోవడానికి కనీసం 2–3 గంటల ముందే భోజనం ముగించండి
నిద్రకు 2–3 గంటల ముందు ఫోన్లు, టీవీలు చూడటం ఆపండి

పడక గది చీకటిగా, నిశ్శబ్దంగా,     కొంచెం చల్లగా ఉండేలా చూసుకోండి
రోజూ వ్యాయామం లేదా యోగా చేయండి
రాత్రిపూట నీరు, టీ, తీపి పానీయాలు అతిగా తీసుకోవద్దు

పడుకునే ముందు పుస్తక పఠనం, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి
పగటిపూట ఎక్కువ సేపు నిద్రపోకండి
సౌకర్యవంతమైన పరుపు, దిండును ఉపయోగించండి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement