ఆటో.. 2 వేలు చిల్లర.. మనోడి స్టోరీ విని పోలీస్ అధికారే ఫైన్ కట్టాడు

Nagpur Cop Pays Fine For Auto Driver Bag Of Coins From Sons Piggy Bank - Sakshi

నాగపూర్: ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం మనం వింటూ వుంటాం గానీ , దాని కొందరు పోలీసులు మాత్రం దీన్ని ఆచరించి మరీ చూపిస్తున్నారు. సాధారణంగా వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు జరిమానా విధించడం తెలిసిందే.కానీ ఓ ఆటో డ్రైవర్ కథ విని చలించిపోయి పోలీస్ అధికారే ఫైన్ కట్టాడు.ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే... నాగపూర్ లోని ఆగ‌స్ట్ 8న ఓ ఆటో డ్రైవ‌ర్ త‌న ఆటోను నో పార్కింగ్ జోన్‌లో పార్క్ చేశాడు. దీంతో ఆ వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు 200 రూపాయ‌ల ఫైన్ వేశారు. కానీ అంత‌కుముందు నుంచి ఆ డ్రైవర్ కట్టకుండా వున్న జరిమానాలతో క‌లిపి 2 వేలుగా చూపించింది. దీంతో ఫైన్ క‌ట్టి ఆటో తీసుకెళ్లాల‌ని పోలీసులు తెలిపారు. ఆటోని పోలీసులు సీజ్ చేయ‌డంతో నానా అవ‌స్థ‌లు ప‌డింది ఖాడ్సే కుటుంబం. ఎలాగైనా ఫైన్ కట్టి ఆటోని విడిపించాలని ఆలోచిస్తుండగా.. అతనికి త‌న కొడుకు  దాచుకున్న చిన్న పిల్లల పిగ్గి బ్యాంక్ కనపడింది. దాన్నిప‌గులగొట్టి.. చిల్ల‌ర అంతా ఏరుకొని నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు.

అయితే అదంతా చిల్ల‌ర నాణేల కావ‌డంతో పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారు. మళ్లీ ఈ ట్విస్ట్ ఏంటి భగవంతుడా అనుకుంటూ సీనియ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ అజ‌య్ మాల‌వియా వ‌ద్ద‌కు వెళ్లాడు ఆ ఆటో డ్రైవర్. అతని వద్ద ఉన్న కాయిన్స్‌ను చూసిన ఆఫీస‌ర్.. ఏం జ‌రిగింది అని ఆరా తీసి అస‌లు విషయం తెలుసుకున్నాడు. అత‌డి మాట‌లు విన్న ఇన్‌స్పెక్ట‌ర్ చ‌లించిపోయారు. వెంట‌నే 2 వేల రూపాయ‌ల ఫైన్‌ను త‌నే క‌ట్టేసి.. ఆటో తీసుకెళ్లాల‌ని ఖాడ్సేకు ఇన్‌స్పెక్ట‌ర్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top