కీలక కేసు.. లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ | Mamata Banerjee Dons Lawyers Coat Arrives At Calcutta High Court | Sakshi
Sakshi News home page

కీలక కేసు.. లాయర్ అవతారమెత్తిన మమతా బెనర్జీ

May 14 2026 11:30 AM | Updated on May 14 2026 11:51 AM

Mamata Banerjee Dons Lawyers Coat Arrives At Calcutta High Court

కోల్‌కాతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ.. న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు చేరుకున్నారు. తన పార్టీ తరపున కీలకమైన కేసులో వాదించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఎన్నికల అనంతర హింస కేసులో ఆమె తన వాదనలు వినిపించనున్నారు.

ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఆయన కుమారుడు శీర్షాన్య బంద్యోపాధ్యాయ కూడా ఉన్నారు. వీరిద్దరూ వృత్తిరీత్యా న్యాయవాదులు. శీర్షాన్య బందోపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించిన పలు అంశాలపై మమతా ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు మరణించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు.

ఈ హింసలో నలుగురు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. 200కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా.. 400కి పైగా అరెస్టులు జరిగాయి. బీజేపీ గెలుపు తర్వాత తమ కార్యకర్తలపై దాడులు జరిగాయని.. పలువురు మరణించారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టులో టీఎంసీ పిటిషన్ వేసింది. మరోవైపు టీఎంసీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ ఆరోపిస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement