Moustache Woman: ‘మీసాలు లేకుండా ఊహించలేను.. నాకెంతో ఇష్టం’

This Kerala Woman Has A Moustache And She Loves her Moustache - Sakshi

తిరువనంతపురం: ముఖంపై అవాంఛిత రోమాలుంటేనే అసౌకర్యంగా ఫీలవుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు తొలగించేస్తుంటారు. మహిళలు నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ, కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళ తాను మాత్రం అందుకు భిన్నం అంటోంది. తన పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరిగి.. కోరమీసంలా మారిపోయింది. అయితే.. వాటిని తొలగించలేనంటోంది శైజ. మీసం లేకుండా జీవితాన్ని ఊహించలేనంటూ సమాధానమిస్తోంది. ప్రస్తుతం మీసంతో ఉన్న శైజ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

కేరళ కన్నూర్‍లోని కుతుపరంబకు చెందిన 35 ఏళ్ల శైజ.. తన మీసాన్ని ఎంతో ఇష్టపడుతున్నట్లు పేర్కొంటోంది. తన వాట్సాప్‌ స్టేటస్‌లలోనూ తన కోరమీసం ఫోటోలతో అలరిస్తోంది. శైజ తన ఐబ్రోస్‌ను ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేయిస్తున్నా.. పైపెదవి పైభాగంలో పెరిగిన మీసాన్ని మాత్రం తొలగించలేదు. ఐదేళ్ల క్రితం పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరిగి నల్లగా దట్టంగా మారాయి. అయితే.. వాటిని తొలగించకుండా అలాగే కొనసాగించాలని నిర్ణయించుకుంది శైజ. 
‘మీసం లేకుండా ఉండటాన్ని ఊహించుకోలేను. కరోనా మహమ్మారి వచ్చినప్పటికీ నేను మాస్క్‌ పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. ఎందుకంటే అది నా ముఖాన్ని కప్పివేస్తుంది. మీసం ఉన్నందుకు అందంగా లేనని  నేనెప్పుడూ  బాధపడలేదు. నాకు నచ్చిందే చేస్తాను.’ అని ఓ వార్తా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మీసక్కరి పేరుతో.. 
మీసంతో ఉన్న శైజకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతుగా నిలిచారు. ఆమె కూతురు సైతం మీసాన్ని ఎంతో ఇష్టపడుతోంది. తనపై కొందరు జోకులు వేస్తున్నారని, అలాంటి వాటిని తాను పట్టించుకోనని చెబుతున్నారు శైజ. కొందరు తనకు మీసక్కరి(మీసంతో ఉ‍న్న మహిళ) అని పేరుపెట్టారని, అందుకే అదే పేరుతో సోషల్‌ మీడియాలో తన ఖాతాలు క్రియోట్‌ చేసినట్లు చెప్పారు శైజ. 

ఇదీ చదవండి: ఇంటికి రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top