కరోనా హాట్‌స్పాట్‌లో తగ్గిన తీవ్రత

Kejriwal Says Coronavirus Bed Occupancy Coming Down - Sakshi

87 శాతానికి పెరిగిన రికవరీ రేటు

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా హాట్‌స్పాట్‌గా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కోవిడ్‌-19 తీవ్రత తగ్గుముఖం పట్టిందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈనెల 23 నుంచి ఆస్పత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయిందని సీఎం వెల్లడించారు. గతంతో పోలిస్తే తక్కువ మంది కరోనా వైరస్‌ బారిపడుతున్నారని, వారిలో చాలావరకూ ఇంటివద్దే చికిత్స పొందుతుండగా, అతితక్కువ మందికే ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురవుతోందని చెప్పారు. దీంతో ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతోందని, ఈనెల 23 నుంచి 26 మధ్య బెడ్‌ ఆక్యుపెన్సీ పడిపోయిందని కేజ్రీవాల్‌ ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కాగా యాక్టివ్‌ కేసుల్లో ఢిల్లీ ప్రస్తుతం ఎనిమిదో స్ధానంలో నిలిచిందని చెప్పారు. కొద్దిరోజుల కిందట ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా ప్రస్తుతం వైరస్‌ను దీటుగా నిలువరించామని పేర్కొన్నారు. ఢిల్లీ వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగత్ర చర్యలు చేపడుతూ సురక్షితంగా ఉండాలని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఇక దేశ రాజధానిలో కోవిడ్‌-19 కేసులు 1.29 లక్షలు దాటగా మరణాల సంఖ్య 3806కి పెరిగింది.ఇక కరోనా వైరస్‌ బారినపడి కోలుకునే వారి సంఖ్య 87 శాతంగా ఉండటం ఊరట కలిగించే పరిణామమని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. చదవండి : ఆసుపత్రి ప్ర‌మాణాలు ప్ర‌పంచ స్థాయికి పెంచాం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top