బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్‌ | Kalita Majhi win Special as saffron wave sweeps Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనంలో ఈమె చాలా స్పెషల్‌

May 5 2026 10:53 AM | Updated on May 5 2026 11:24 AM

Kalita Majhi win Special as saffron wave sweeps Bengal

పశ్చిమ బెంగాల్‌లో   ఒక సాధారణ మహిళ అనూహ్య విజయం సాధించారు. దీదీ సర్కార్‌కు ఝలక్‌ ఇచ్చి బీజేపీ సాధించిన ప్రభంజనంలో గుస్కారాకు చెందిన గృహ కార్మికురాలు  కలితా మాఝీ(37)  విజయం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.  గతంలో గృహ కార్మికురాలిగా పనిచేసిన కలితా మాఝీ, ఆస్గ్రామ్ నియోజకవర్గం నుండి ఘనవిజయం సాధించడం విశేషంగా నిలుస్తోంది.

కలితా మాఝీ వంటి సాధారణ నేపథ్యం ఉన్న అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ ప్రజలకు చేరువయ్యింది. పార్టీ లోతైన సంస్థాగత నిర్మాణం, ఓటర్లను ఆకట్టుకోవడం దీదీ ఇలాకాలో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇంటి పనిమనిషిగా నెలకు రూ.2,500 సంపాదించే కలితా మాఝీ బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించి ఎమ్మెల్యేగా అవతరించారు. తన సమీప ప్రత్యర్థి శ్యామ ప్రసన్న లోహర్‌పై 12,535 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 1,07,692 ఓట్లు వచ్చాయి. ఇది సిండ్రెల్లా స్టోరీ కాదు ఇది కలితా 'హిస్టరీ. పనిమనిషి నుంచి శాసనసభ వరకు ఎదిగిన ఆమె తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తి.

ఇదీ చదవండి: బెంగాల్‌ పోరులో ఒక సెన్సేషన్‌ కలితా మాఝీ

కాగా  రాష్ట్రంలో 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికి బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీ  294 స్థానాలకు గాను 206 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement