చెన్నై: టీవీకే అధినేత విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్‌తో భేటీకి జగనాయగన్ సినిమా ప్రొడ్యుసర్‌ను తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై రాజకీయ ప్రత్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో సినిమా ప్రొడ్యూసర్‌కి ఏం పని అని అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా, టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జగనాయగన్ ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ కూడా వచ్చారు. దీంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి.. ప్రభుత్వ ఏర్పాటులో విషయంలో ఎందుకు భాగమయ్యారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఇదే సమయంలో విజయ్, నారాయణపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం వామపక్షాలకు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. ఇతర పార్టీలకు కూడా ఆయన ద్వారానే డబ్బు చేరుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోట్‌కాల్‌కి విరుద్దంగా విజయ్.. ప్రొడ్యూసర్‌ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారని విమర్శించారు. చివరగా.. నారాయణపై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యర్థులు సిద్దమైనట్టు సమాచారం.


