జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం | Jammu & Kashmir Encounter Between Security Forces and Terrorists | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాది హతం

Jul 24 2024 10:05 AM | Updated on Jul 24 2024 10:38 AM

Jammu & Kashmir Encounter Between Security Forces and Terrorists

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో మంగళవారం రాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు తాజాగా ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ప్రస్తుతం ఆప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాను గాయపడ్డారు.

ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ఎక్స్‌లో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా సరిహద్దు జిల్లా లోలాబ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

కుప్వారాలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించిన నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా భారత సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించారు. తాజాగా భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. లోలాబ్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీని ఆధారంగా కుప్వారా పోలీసులు ఆర్మీకి చెందిన 28, 22 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement