
అహ్మదాబాద్: క్రికెట్ వరల్డ్‌కప్‌లో నేడు భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మొతేరా స్టేడియంలో నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ స్టేడియంపై ఐఏఎఫ్ సూర్యకిరణ్ బృందం ఎయిర్ షోను ప్రదర్శించింది. ఉత్కంఠభరితమైన దృశ్యాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
IAF's Suryakiran team performs Aerobatic Show over Narendra Modi Stadium ahead of India vs Australia in the ICC Cricket World Cup 2023 Final pic.twitter.com/CKCjJ5jGCX
— DeshGujarat (@DeshGujarat) November 19, 2023
ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. మొదట్లోనే కాస్త తడబడింది. ప్రస్తుతం కోహ్లి, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు. క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. భారత్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా మెరుగ్గా రాణించాలని అభిమానులు పూజలు చేస్తున్నారు.
More visuals of the Indian Air Force's air show over Narendra Modi Stadium pic.twitter.com/kXpd2kkJFa
— DeshGujarat (@DeshGujarat) November 19, 2023
ఇదీ చదవండి: భారత్ మ్యాచ్ గెలిస్తే చాట్ ఫ్రీ!
Comments
Please login to add a commentAdd a comment