India Surpassed The 200 Crore Mark In Vaccination - Sakshi
Sakshi News home page

దేశంలో దడ పుట్టిస్తున్న పాజిటివ్‌ కేసులు.. వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు

Jul 17 2022 2:52 PM | Updated on Jul 17 2022 3:36 PM

India Surpassed The 200 Crore Mark In Vaccination - Sakshi

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా 20వేలకు పైగానే పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,528 మందికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, అదే సమయంలో కరోనాతో 49 మంది మృతిచెందారు.దీంతో, దేశంలో ఇప్పటికి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల మొత్తం సంఖ్య 4,37,50,599కి  చేరగా.. కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 5,25,709 మందికి చేరుకుంది. 

ఇదిలా ఉండగా.. దేశంలో ప్రస్తుతం 1,43,449 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక, గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్‌లో పేర్కొంది. కాగా, కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరో కొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేశారు. వయోజన జనాభాలో 98 శాతం మంది మొదటి డోసు టీకాను తీసుకున్నట్టు తెలిపింది. ఇక, శనివారం ఒక్కరోజే 25,59,840 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటినందుకు భారతీయులందరికీ అభినందనలు. అసమానంగా కృషిచేసి ఈ రికార్డును అందుకోవడం గర్వకారణం. ఇది కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేస్తుందని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement