భారత్‌–చైనా మధ్య 15వ దఫా చర్చలకు రంగం సిద్ధం

India China 15th Round Of Talks Tomorrow - Sakshi

బీజింగ్‌/న్యూఢిల్లీ: భారత్‌–చైనా మధ్య ఈ నెల 11న జరగబోయే 15వ దఫా చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలకు ముగింపు పలకడమే ఈ ఉన్నత స్థాయి సైనిక చర్చల లక్ష్యమని అన్నారు. శుక్రవారం లద్దాఖ్‌లోని చుషూల్‌ మాల్డో మీటింగ్‌ పాయింట్‌ వద్ద ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. భారత్‌–చైనా మధ్య పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి తప్పనిసరిగా నెలకొనాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ శ్రింగ్లా చెప్పారు.

(చదవండి: దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top