దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌ హోలీ శుభాకాంక్షలు | Holi 2022: President Kovind, PM Modi Other Political Leaders Greetings To Nation | Sakshi
Sakshi News home page

దేశ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌ హోలీ శుభాకాంక్షలు

Mar 18 2022 11:27 AM | Updated on Mar 18 2022 11:46 AM

Holi 2022: President Kovind, PM Modi Other Political Leaders Greetings To Nation - Sakshi

న్యూఢిల్లీ: రంగుల కేళీ హోలీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘హోలీ శుభ సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ, మత సామరస్యం సయోధ్యకు సజీవ ఉదాహరణ. హోలీ అందరి జీవితాల్లో ఆనందం, ఉత్సాహం. కొత్త శక్తిని నింపాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్‌ చేశారు.
చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ హోలీ శుభాకాంక్షలు

ప్రధాని మోదీ, రాష్ట్రపతితోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజ‌లకు సీఎం కేసీ‌ఆర్‌ హోలీ శుభా‌కాం‌క్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజ‌లకు ముఖ్యమంత్రి కే చంద్రశే‌ఖ‌ర్‌‌రావు హోలీ పండుగ శుభా‌కాం‌క్షలు తెలి‌పారు. అన్ని వర్గాల ప్రజలు కలి‌సి‌మె‌లిసి సంతో‌షంగా సాగా‌లనే సందే‌శాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొ‌న్నారు. ప్రకృతి మెచ్చే రంగు‌లతో హోలీని ఆనం‌దో‌త్సా‌హా‌లతో జరు‌పు‌కో‌వా‌లని సీఎం సూచించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ట్వీట్‌ చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement