అమ్మో ఈ చేప ఖరీదు రూ.36 లక్షల!

A Giant Telia Bhola Weight Seventy Six Kg Caught In Sunderbans River Sold For Thirty Six Lakhs - Sakshi

పశ్చిమబెంగాల్‌: ఈ మధ్యకాలంలో అత్యంత భారీ  చేపను పట్టుకుని ఒక్కరోజులోనే ధనవంతులుగా మారిన కథనాలు విన్నాం. అచ్చం అలానే పశ్చిమ బెంగాల్‌కి చెందిన మత్స్యకారుడు బార్మన్ భారీ తెలియా భోలా చేపను పట్టుకుని ధనవంతుడిగా మారిపోయాడు.

(చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు)

వివరాల్లోకెళ్లితే ఐదుగురు మత్స్యకారుల బృందం పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ నదులలో చేపలను వేటాడుతుండగా భారీ తెలియా భోలా చేపను పట్టుకున్నారు. అయితే ఆ చేప సుమారు 7 అడుగుల పొడవు, 75 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఈ మేరకు మత్స్యకారులందరూ సమిష్టిగా కష్టపడితేనే ఆ భారీ చేపను ఒడ్డుకు తీసుకురాగలరు. అంతేకాదు ఆ చేపను హోల్‌సేల్‌ మార్కెట్‌కి తీసుకువెళ్లితే అక్కడ అనుహ్యంగా అత్యధిక ధర పలికింది.

దీంతో ఆ తేలియా  భోలా చేప కిలో రూ.49,300 చొప్పున మొత్తం సుమారుగా రూ.36 లక్షలకు విక్రయించారు. పైగా ఈ చేప పొట్టలో అత్యంత విలువైన వనరులు ఉంటాయని వాటిని మందులు, ఇతర వస్తువుల తయారీలో వినియోగిస్తారని మత్స్యకారులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా మత్య్సకారుడు బార్మన్‌ మాట్లాడుతూ......"ప్రతి ఏడాది నేను తెలియా భోలా చేపలు పట్టడానికి వెళ్తాను. కానీ ఇంత పెద్ద చేపను పట్టుకుంటానని ఊహించ లేదు" అని చెప్పాడు. గతేడాది  పశ్చిమ బెంగాల్‌లోని ఈ నదిలోనే 52 కిలోల భోలా చేపను పట్టుకున్న ఒక వృద్ధ మహిళ రాత్రికి రాత్రే  ధనవంతురాలైన సంగతి తెలిసిందే.

(చదవండి: చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top