ఫుడ్‌ పార్సిళ్లపై ప్యాకింగ్‌ సమయమూ ఉండాలి

Food parcels to have use-by time label - Sakshi

తిరువనంతపురం: ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి? ఎప్పటిలోగా తినడం సురక్షితం? అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ఫుడ్‌ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది.

అమలు చేయని వారిపై చర్యలు తప్పవని ఆరోగ్య మంత్రి వీణా జార్జి హెచ్చరించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్‌ పాయిజనింగ్‌ ఘటనల నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలిచ్చామన్నారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు హెల్త్‌ కార్డులు తీసుకోవాల్సిన గడువును మరో రెండు వారాలకు పొడిగించామన్నారు. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు ఆహార తనిఖీలను  ముమ్మరం చేశారన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top