Massive Fire Breaks Out In Plastic Godown At Delhi's Tikri Kalan - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 

Apr 8 2023 10:30 AM | Updated on Apr 8 2023 10:43 AM

Fire Broke Out In Plastic Godown At Delhi Tikri Kalan - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని టిక్రీ కలాన్‌లో ఉన్న పీవీసీ మార్కెట్‌ శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

వివరాల ప్రకారం.. టిక్రీ కలాన్‌లో ఉన్న పీవీసీ మార్కెట్‌లో ఉన్న ప్లాస్టిక్‌ గోదాంలో మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్‌ సంబంధిత వస్తువులు ఉన్న కారణంగా పెద్దఎత్తున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. కిలోమీటర్‌ దూరంలో కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 26 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌కే దువా చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement