ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!

Fire Breaks Out In Factory At Delhi Wazirpur Area - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వజీర్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘటనపై ఆరా తీశారు. 

వివరాల ప్రకారం.. వజీర్‌పూర్‌ పారిశ్రామిక ప్రాంతంలో ధర్మకాంత సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టపొగ అలుముకుంది. అగ్నిప్రమాద సమాచారం అందిన వెంటనే 25 అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. కాగా, ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఘటనపై ఆరా తీశారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిదన్న కారణాలు, ఆస్తి నష్టం తెలియాల్సి ఉంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top