ఫార్ములా 1 రేస్ కారులాంటి వాహనంలో పాల క్యాన్‌లు... వీడియో వైరల్‌

Driver Spotted Delivering Milk Go kart Like Vehicle - Sakshi

A viral video shows motorist carrying milk cans: చాలామంది మంచి ఖరీదైన బైక్‌ పై రైడ్‌ చేయాలనుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్య లేక మరేదైన కారణాల వల్లో తమకు ఇష్టమైన వాహనాల్లో వెళ్లలేకపోతుంటారు. ఇది సర్వసాధరణమే. కానీ కొంతమంది తమ కలల వాహనంలోనే రైడ్‌ చేయాలనుకుంటారు. అందుకోసం తమ సృజనాత్మకతకు పదును పెట్టి మరీ తమ డ్రీమ్‌ వాహనాన్ని రూపొందించుకుంటారు. ఇక్కడోక వ్యక్తి అచ్చం అలాంటి కోవకు చెందినవాడే.

వివరాల్లోకెళ్తే...ఒక వ్యక్తి ఫార్తులా వన్‌ రేస్‌ కారు మాదిరి వాహనంలో పాల క్యాన్‌లు మోసుకు వెళ్తున్నాడు. పైగా అతను ఫార్ములా వన్‌ కారు రైడ్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్‌ వేసుకుంటారో అలానే అతను నల్లటి కోట్‌, హెల్మెట్‌ ధరించి రైడ్‌ చేస్తున్నాడు. అయితే అతను పాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని రోడ్స్‌ ఆఫ్‌ ముంబై సంఘం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

ఇలాంటి ఇన్నోవేషన్‌ వీడియోలను షేర్‌ చేసేందుకు ఆసక్తి కనబర్చే దిగ్గజ పారశ్రామికవేత్త ఆనంద్‌ మహింద్రాకి ఈ వీడియో నచ్చుతుందంటూ నెటిజన్లు ట్వీట్‌ చేశారు. నిజానికి సృజనాత్మకత భారతీయుల రక్తంలోనే ఉంది. గతంలో కూడా ఓ వ్యక్తి విద్యుత్తు లేకుండా పనిచేసే చెక్క ట్రెడ్‌మిల్‌ రూపోందించి అందరి మన్నలను అందుకున్న సంగతి తెలిసిందే.

(చదవండి: సెలవు కావాలని వైరల్‌ లేఖ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top