కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ | DA Hike LPG Gas Subsidy Extended And Jute Support Price Increase | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ - డీఏ పెంపు

Mar 7 2024 8:57 PM | Updated on Mar 7 2024 9:05 PM

DA Hike LPG Gas Subsidy Extended And Jute Support Price Increase - Sakshi

కేంద్ర ప్రభుత్వం డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచే నిర్ణయానికి ఈ రోజు (గురువారం) ఆమోదం తెలిపినట్లు. ఈ పెంపు తరువాత డియర్‌నెస్ అలవెన్స్ & డియర్‌నెస్ రిలీఫ్ (డిఆర్) 50 శాతానికి చేరుతుంది. ఈ పెంపు వల్ల కేంద్రం రూ.12,868.72 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వచ్చే నెల నుంచే జీతాలు, పెన్షన్ వంటివి భారీగా పెరుగుతాయి. డియర్‌నెస్ అలవెన్స్ పెంపుతో పాటు, రవాణా అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్‌లలో కూడా 25 శాతం పెరుగుదల ఉంటుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement