వ్యాక్సినేషన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే ఎవరిని సంప్రదించాలి?

Cowin Portal Registration Full Details Questions And Answers Special Story - Sakshi

కరోనా టీకా... ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ ఇదే. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మే1వ తేదీ నుంచి టీకా వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన... వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు ఎక్కడ విన్నా టీకా టాపిక్కే నడుస్తోంది. టీకా ఎలా వేయించుకోవాలి? టీకా వేయించుకునేందుకు ఏం చేయాలి? మొబైల్‌ యాప్‌లుంటాయా? ఒక కుటుంబంలో ఒక స్మార్ట్‌ ఫోనే ఉంటే ఎలా రిజిస్టర్‌ చేసుకోవాలి? అసలు రిజిస్ట్రేషన్‌ ఉండాలా? నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళితే వేయరా? మరి చదువులేని వారు.. స్మార్ట్‌ ఫోన్లపై అవగాహన లేని వారి పరిస్థితి ఏంటి? వ్యాక్సిన్‌ కోసం ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం?... రాష్ట్ర ప్రజానీకంలో తలెత్తుతున్న ఇలాంటి సందేహాలన్నిటికీ కోవిన్‌ పోర్టల్‌ సమాధానమిస్తోంది. 

కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కోసం ఎక్కడ రిజిస్టర్‌ చేసుకోవాలి?
www.cowin.gov.in లింకు ద్వారా కోవిన్‌ పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ ‘రిజిస్టర్‌/సైన్‌ఇన్‌ యువర్‌ సెల్ఫ్‌’అనే ట్యాబ్‌ మీద క్లిక్‌ చేయడం ద్వారా మీ రిజస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 

వ్యాక్సినేషన్‌కోసం మొబైల్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలా?
మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం అధీకృత మొబైల్‌ యాప్‌ లేదు. కోవిన్‌ పోర్టల్‌ ద్వారానే రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆరోగ్య సేతు ద్వారా కూడా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 

ఏ వయసు వారు కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి?
ప్రస్తుతానికి 45 ఏళ్లు దాటిన వారంతా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. మే1 తేదీకి 18 ఏళ్లు నిండిన వారంతా  బుధవారం నుంచి కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకునేందుకు అవకాశముంది. 

వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరా?
అవసరం లేదు. ప్రస్తుతం కొన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో కొన్ని స్పాట్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కానీ, కోవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని వెళ్లడం ద్వారా ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 

వ్యాక్సిన్‌ కోసం రిజిస్టర్‌ చేసుకున్నామన్న విషయం ఎలా ధ్రువీకరించబడుతుంది?
మీ వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ నిర్ధారణ జరిగిన వెంటనే వ్యాక్సినేషన్‌ కేంద్రం, వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన రోజు, సమయం తదితర వివరాలన్నీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయి. మీరు ఈ వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. 

అపాయింట్‌మెంట్‌ లేకుండా వ్యాక్సినేషన్‌ చేయరా?
వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా వ్యాక్సిన్‌ కోసం అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. అక్కడకు వెళ్లి సమయం వృధా చేసుకోకుండా ముందుగా అపాయింట్‌మెంట్‌ తీసుకుని వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది.

రెండోసారి వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరా?
అవును. రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్‌ వల్ల ప్రయోజనం ఉంటుంది. అది కూడా రెండుసార్లూ ఒకే రకమైన వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 

రెండో డోస్‌ ఎప్పుడు తీసుకోవాలి?
మొదటి డోస్‌ తీసుకున్న 4 నుంచి 6 వారాల్లోపు కోవాగ్జిన్, 6 నుంచి 8 వారాల్లోపు కోవిషీల్డ్‌ రెండో డోస్‌ తీసుకోవాలి. మీ అనుకూలతను బట్టి ఈ కాలపరిమితి లోపు రెండో డోస్‌ తీసుకోవాలి. 

కోవిన్‌ ద్వారా రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ షెడ్యూల్‌ అవుతుందా?
అవును. రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం కోవిన్‌ పోర్టల్‌ మీకు సాయపడుతుంది. 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ సమయంలో సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి?
1075 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు.కోవిన్‌ పోర్టల్‌ ద్వారా కూడా మీ సందేహాలు తీర్చుకోవచ్చు. 

అన్ని చోట్లా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తారా?
లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా ఇస్తారు. ప్రై వేటు ఆసుపత్రుల్లో రుసుము వసూలు చేస్తారు. 

వ్యాక్సిన్‌ను మనం ఎంపిక చేసుకోవచ్చా?
అన్ని రకాల వ్యాక్సిన్లు శ్రేయస్కరమైనవే. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. 

వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ ఎందుకు?
మీరు వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టుగా నిర్ధారణకు, అవసరమైన చోట చూపించేం దుకు సర్టిఫికెట్‌ ఉపయోగపడుతుంది. 

ఈ సర్టిఫికెట్‌ ఎవరిస్తారు?
మీకు వ్యాక్సిన్‌ ఇచ్చిన కేంద్రంలోనే సర్టిఫికెట్‌ కాపీ ఇస్తారు. మీరు అడిగి మరీ తీసుకోవచ్చు. 

ఈ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చా?
కోవిన్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతులో ఈ సర్టిఫికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇచ్చిన మొబైల్‌ నంబర్‌ ద్వారానే దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు ఏ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి?
వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో ఇచ్చిన ధ్రువపత్రాలనే వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాలి.

రెండో డోస్‌ ఎక్కడైనా తీసుకోవచ్చా?
అవును. మన దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రం, ఏ జిల్లాలోనైనా రెండో డోస్‌ తీసుకోవచ్చు. కానీ, మీరు మొదటి డోస్‌ తీసుకున్న చోట మాత్రమే మీరు తీసుకోవాల్సిన వ్యాక్సిన్‌ (మొదటిసారి తీసుకున్నది) అందుబాటులో ఉండే అవకాశముంది. 

వ్యాక్సినేషన్‌ కారణంగా ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తే ఎవరిని సంప్రదించాలి?
మీరు వ్యాక్సిన్‌ వేసుకున్న కేంద్రంలో లేదా 1075 టోల్‌ఫ్రీ నంబర్, 9111–23978046 అనే హెల్ప్‌లైన్‌నంబర్‌ లేదా 0120–4473222 అనే టెక్నికల్‌ హెల్ప్‌లైన్‌నంబర్‌ లేదా nvoc2019@gov.in అనే ఈమెయిల్‌ ఐడీలో సంప్రదించవచ్చు.
చదవండి: 
యూకే వేరియంట్‌లాగా వేగంగా వ్యాపిస్తోంది
70 టన్నుల ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రాక

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 12:30 IST
వాషింగ్టన్: ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ మహమ్మారిని అడ్డుకట్టకు టీకాతోనే సాధ్యమని భావించి ఆయా దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో...
06-05-2021
May 06, 2021, 11:43 IST
తిరువనంతపురం: కేరళలో కరోనా రెండో దశ విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కట్టడికి కేరళ...
06-05-2021
May 06, 2021, 08:18 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేస్తుండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం...
06-05-2021
May 06, 2021, 08:06 IST
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్‌): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్‌లో ఉంటూ పాజిటివ్‌ దృక్పథంతో...
06-05-2021
May 06, 2021, 06:06 IST
జెనీవా (స్విట్జర్లాండ్‌): ఈ ఏడాదికి వాయిదా పడ్డ యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను సాఫీగా జరిపేందుకు నడుం బిగించిన యూనియన్‌...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మూడురోజుల పాటు కాస్త తగ్గుముఖం పట్టిన రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు...
06-05-2021
May 06, 2021, 05:33 IST
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత...
06-05-2021
May 06, 2021, 05:27 IST
పుట్టపర్తి అర్బన్‌: కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. పట్టణాలన్నీ వైరస్‌ బారిన పడినా.. కొన్ని పల్లెలు మాత్రం భద్రంగా...
06-05-2021
May 06, 2021, 05:24 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆక్సిజన్‌ కొరత ఎందరి ప్రాణాలనో బలితీసుకుంటోంది. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా ప్రభుత్వాస్పత్రి కరోనా వార్డులో...
06-05-2021
May 06, 2021, 05:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా...
06-05-2021
May 06, 2021, 05:17 IST
తిరుమల: కరోనా నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి రాష్ట్రంలో మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల...
06-05-2021
May 06, 2021, 04:33 IST
కర్నూలు (హాస్పిటల్‌): కోవిడ్‌ బాధితుల్లో కొందరు శరీరంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు నిమిషానికి...
06-05-2021
May 06, 2021, 02:54 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి...
06-05-2021
May 06, 2021, 01:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ కారణంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్న మరణాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో...
06-05-2021
May 06, 2021, 01:05 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఉపయోగం లేదని నమ్ముతున్నాం. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించినా...
06-05-2021
May 06, 2021, 01:05 IST
ముంబై: రెండో దశ కరోనా వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన ఉద్దీపన చర్యలు స్టాక్‌ మార్కెట్‌ను...
06-05-2021
May 06, 2021, 00:57 IST
ముంబై: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలను ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వ్యక్తులు, చిన్న, మధ్య తరహా వ్యాపార...
06-05-2021
May 06, 2021, 00:40 IST
న్యూఢిల్లీ: కరోనా వల్ల అతలాకుతలం అయిన ఢిల్లీ ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌...
05-05-2021
May 05, 2021, 18:41 IST
అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో...
05-05-2021
May 05, 2021, 18:23 IST
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top