దేశంలో కొత్తగా 26,382 కరోనా కేసులు

Coronavirus 26,382 New Coronavirus Cases Registered India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 99 లక్షలు దాటింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 26,382 కరోనా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో  మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,32,548కు చేరింది. అదే విధంగా  గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 387 మంది మృతి చెందారు. ఈ మేరకు బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి  వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 94,56,449గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోవిడ్‌ మృతుల సంఖ్య 1,44,096కు చేరింది. ప్రస్తుతం దేశంలో దేశంలో 3,32,002 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. చదవండి: 2022 వరకు ప్రపంచంలో ఐదొంతుల జనాభాకు టీకా అందదు

తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు..
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గడిచిన 24 గంటల్లో కొత్తగా 536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్త బయటపడ్డ కోవిడ్‌ పాజిట్‌ కేసుల సంఖ్య 2,79,135కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా నుంచి వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్‌ అయిన వారి మొత్తం సంఖ్య 2,70,450 గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1502 మంది కోవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 7,183 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top