ఆవిష్కరణ: కరోనాను చంపే మాస్క్‌ అభివృద్ధి

Class 12 Bengal Student Says Her Mask Can Kill Coronavirus - Sakshi

పశ్చిమ బెంగాల్‌ బాలిక ఆవిష్కరణ

కోల్‌కతా: కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలు విధించినప్పటికి మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్‌ ధరిస్తూ.. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు, శాస్త్రవేత్తలు, వైద్యులు. ఇక కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి మాస్క్‌ తప్పనిసరి అయ్యింది. కరోనా నుంచి మనల్ని కాపాడే ఆయుధం మాస్కే అని ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మాస్క్‌ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కోవిడ్‌ వైరస్‌ను చంపే మాస్క్‌ని అభివృద్ధి చేశారు. 12వ తరగతి విద్యార్థిని దీనిని అభివృద్ధి చేసింది. ఈ మాస్క్‌ కరోనాను చంపేస్తుందని విద్యార్థి పేర్కొంది. 

ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్‌ పుర్బ బర్ధమాన్‌ జిల్లాకు చెందిన దిగ్నాటికా బోస్‌ ఇంటర్‌ సెకడింయర్‌ చదువుతుంది. కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతుండటంతో దాన్ని కట్టడి చేయడం ఎలా అని ఆలోచించసాగింది. ఈ క్రమంలో తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టి విభిన్నమైన మాస్క్‌ను రూపొందించింది. ఈ మాస్క్‌ కరోనా వైరస్‌ను చంపేస్తుందని తెలిపింది. దిగ్నాటిక ఆవిష్కరించిన ఈ మాస్క్‌ను ముంబైలోని గూగుల్స్‌ మ్యూజియం ఆఫ్‌ డిజైన్‌ ఎక్సలెన్స్‌లో ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా దిగ్నాటిక మాట్లాడుతూ.. ‘‘నేను తయారు చేసిన ఈ మాస్క్‌లో మూడు చాంబర్లుంటాయి. మొదటి చాంబర్‌లో ఉండే అయాన్‌ జనరేటర్‌ గాలిలోని దుమ్ము కణాలను వడబోస్తుంది. ఇలా ఫిల్టర్‌ అయిన గాలి సెకండ్‌ చాంబర్‌ గుండా మూడో దానిలోకి ప్రవేశిస్తుంది. కెమికల్‌ చాంబర్‌గా పిలిచే దీనిలో సబ్బు కలిపిన నీరు ఉంటుంది. ఫిల్టర్‌ అయ్యి వచ్చిన గాలిలో ఉండే కరోనా వైరస్‌ను ఈ సబ్బు నీరు చంపేస్తుంది’’ అని తెలిపింది. 

ఇక ‘‘కోవిడ్‌ పేషెంట్లు ఈ మాస్క్‌ను వినియోగిస్తే.. పైన చెప్పిన ప్రాసేస్‌ రివర్స్‌లో జరుగుతుంది. వారు వదిలిన గాలిలో కోవిడ్‌ క్రిములుంటాయి. థర్డ్‌ చాంబర్‌లోని సబ్బు నీటిలోకి ప్రవేశించినప్పడు అవి చనిపోతాయి. ఆ తర్వాత వైరస్‌ రహిత గాలి మిగతా రెండు చాంబర్ల గుండా బయటకు వస్తుంది. దీని వల్ల వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు’’ అని తెలిపింది. 

‘‘కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోమని ప్రచారం చేస్తున్నారు. అంటే సబ్బు నీరు కరోనాను చంపుతుందని అర్థం. దీని ఆధారంగా చేసుకుని నేను ఈ మాస్క్‌ అభివృద్ధి చేశాను. ట్రయల్స్‌ నిర్వహించడం కోసం త్వరలోనే రాష్ట్ర వైద్య శాఖ అధికారులను కలుస్తాను’’ అని చెప్పుకొచ్చింది దిగ్నాటిక. ఇక ఫస్ట్‌ లాక్‌డౌన్‌ విధించిన సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చిందని తెలిపిన దిగ్నాటిక.. తనకు అందుబాటులో ఉన్న వనరులతో దాన్ని ఆవిష్కరించినట్లు వెల్లడించింది.

ఇక దిగ్నాటికాకు ఇలా విభిన్న ఆవిష్కరణలు చేయడం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. గతంలో ఆమె ఓ కళ్లజోడును తయారు చేసింది. దీన్ని ధరిస్తే.. తల వెనక్కు తిప్పకుండానే మన వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇవి అడవిలోకి వెళ్లే వారికి బాగా ఉపయోగపడ్డాయి. వెనక నుంచి ఏవైనా క్రూరమృగాలు వస్తే గమనించడానికి సాయం చేశాయి. ఇప్పటికే దిగ్నాటికా మూడు సార్లు ఏపీజే అబ్దుల్‌ కలాం ఇగ్నైట్‌ అవార్డ్‌ అందుకుంది. చెవులపై భారం పడకుండా ఉండేలా రూపొందించిన మాస్క్‌కు గాను మూడో సారి ఏపీజే అబ్దుల్‌ కలాం ఇగ్నైట్‌ అవార్డు లభించింది. 

చదవండి: మాస్కు లేకుండా మాజీ ఎమ్మెల్యే తీగల, రూ.1000 ఫైన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-05-2021
May 11, 2021, 19:11 IST
తాజాగా నమోదవుతున్న కేసులు డిశ్చార్జ్‌ల కన్నా తక్కువగా ఉంటున్నాయి. తెలంగాణ తాజా కరోనా బులెటిన్‌ విడుదల.
11-05-2021
May 11, 2021, 17:29 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అంచనాలను బట్టి ఓ,...
11-05-2021
May 11, 2021, 17:13 IST
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి..ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్‌ కేటాయింపులు, సరఫరాపై లేఖలో...
11-05-2021
May 11, 2021, 16:33 IST
మధ్యాహ్నం కేబినెట్‌ భేటీ ఉందని, సమావేశం అనంతరం లాక్‌డౌన్‌, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు.
11-05-2021
May 11, 2021, 15:42 IST
త్రిసూర్‌:  కరోనా మహమ్మారి  సినీ రంగంలో పెనువిలయాన్ని సృష్టిస్తోంది. పలువురు సినీ రంగానికి చెందిన కరోనా బారిన పడి అసువులు బాశారు. మలయాళ...
11-05-2021
May 11, 2021, 15:30 IST
ఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) బ్యాటింగ్‌ కోచ్‌ మైఖేల్‌ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం నిర్వహించిన...
11-05-2021
May 11, 2021, 15:29 IST
జెనీవా: నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్‌ మెడిసిన్‌ ఐవర్‌మెక్టిన్‌ ను తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా...
11-05-2021
May 11, 2021, 13:58 IST
జెనీవా: భారత్‌లో బయటపడిన కరోనా వైరస్‌ బి-1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన స్ట్రెయిన్‌గా వర్గీకరించింది. ఇండియన్‌ స్ట్రెయిన్‌పై...
11-05-2021
May 11, 2021, 13:26 IST
పట్నా: ‘‘వైద్యో నారాయణో హరిః’’ అన్నారు. ఓ వైపు కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మరో వైపు డాక్టర్లు తమ...
11-05-2021
May 11, 2021, 13:21 IST
ఢిల్లీ: ప్రముఖ కరోనా వ్యాక్సిన్‌ తయారీదారు భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్‌ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి...
11-05-2021
May 11, 2021, 13:12 IST
యశవంతపుర: కరోనాతో మృతి చెందిన అమ్మ మృతదేహాన్ని కొడుకు ఆటోలో సొంతూరికి తీసుకెళ్లాడు. మండ్య జిల్లా వళవళ్లికి చెందిన శారదమ్మ...
11-05-2021
May 11, 2021, 13:04 IST
రోమ్‌: ప్రపంచంలో ఎక్కడ చూసిన కరోనా ప్రభావమే కనిపిస్తోంది.  మహమ్మారి అడుగు పెట్టిన ప్రతి చోటా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్‌కు...
11-05-2021
May 11, 2021, 12:55 IST
సుమారు 179 మంది వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు చేయడం విశేషం. 
11-05-2021
May 11, 2021, 12:24 IST
మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదు. ...
11-05-2021
May 11, 2021, 11:49 IST
దొడ్డబళ్లాపురం: కరోనా రక్కసి అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తోంది. దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్‌ కుటుంబం మొత్తం...
11-05-2021
May 11, 2021, 11:44 IST
చిత్తూరుకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (అపోలో)లో చేరాడు. వారం తర్వాత మెరుగైన...
11-05-2021
May 11, 2021, 11:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా...
11-05-2021
May 11, 2021, 10:23 IST
సాక్షి, బెంగళూరు: కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలను అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో...
11-05-2021
May 11, 2021, 09:45 IST
ఒంగోలు టౌన్‌: కరోనా బారిన పడినవారు మానసిక ఒత్తిడికి గురికాకూడదు. అదే సమయంలో అధిక పోషక విలువలు కలిగిన ఆహారం...
11-05-2021
May 11, 2021, 09:33 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు ధరించడం కచ్చితం. ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వైరస్‌ నుంచి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top