పీఎం కేర్స్‌కి విరాళం.. అయినా తల్లికి బెడ్డు దొరకలేదు.. | A Citizen Asked PM To Reserve A Bed In Hospital For HIs Family | Sakshi
Sakshi News home page

పీఎం కేర్స్‌కి విరాళం.. అయినా తల్లికి బెడ్డు దొరకలేదు..

May 25 2021 4:59 PM | Updated on May 25 2021 7:19 PM

A Citizen Asked PM To Reserve A Bed In Hospital For HIs Family - Sakshi

న్యూఢిల్లీ : మీరు అడిగినంత విరాళం పీఎం కేర్స్‌కి పంపిస్తాను... దయచేసి థర్డ్‌ వేవ్ సమయానికి ఆస్పత్రిలో ఓ బెడ్‌ నా కుటుంబానికి రిజర్వ్‌ చేసి పెడతారా ? అంటూ ప్రధాన మంత్రి కార్యాలయానికి రిక్వెస్ట్‌ పంపాడో వ్యక్తి. కరోనా సెకండ్‌ వేవ్‌లో తన తల్లికి కరోనా సోకిందని.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఒక్క బెడ్‌ సంపాదించలేకపోయానంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. తన కుటుంబంలో ఇంకో వ్యక్తిని కోల్పోయేందుకు సిద్ధంగా లేనని... అందుకే థర్డ్‌ వేవ్‌ నాటికి తనకు ఓ బెడ్‌ కావాలంటూ రిక్వెస్ట్‌ పంపాడు. విజయ్‌పారిఖ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ వేదికగా పీఎంవోను రిక్వెస్ట్‌ చేశాడు

రూ.2.51 లక్షల విరాళం
గతంలో పీఎంకేర్‌ ఫండ్‌కి రూ.2.51 లక్షల రూపాయలను విజయ్‌ పారిఖ్‌ విరాళంగా అందించారు. అయితే కరోనా సెకండ్‌  వేవ్‌ విజృంభనంలో ఆయనకు వైద్య రంగం నుంచి భరోసా లభించలేదు. కనీసం బెడ్‌ కూడా దొరక్క తల్లిని కోల్పోయాడు. దీంతో పీఎంకేర్స్‌కి తన ఆవేదన ఇలా వ్యక్తం చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement